ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కార్తీ "జపాన్" ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్..!!

cinema |  Suryaa Desk  | Published : Sat, Nov 12, 2022, 04:53 PM

హీరో కార్తీ నటించబోతున్న కొత్త చిత్రం "జపాన్". పూజా కార్యక్రమాలతో రీసెంట్గానే ప్రారంభమైన ఈ సినిమా నుండి కార్తీ ఫస్ట్ లుక్ ను నవంబర్ 14వ తేదీన విడుదల చెయ్యబోతున్నట్టు తెలుపుతూ మేకర్స్ ప్రీ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు. మెడలో లావైన బంగారు గొలుసు, దానికి వజ్రాలతో పొదగబడిన రూపాయి బిళ్ళ లాకెట్ ... ఈ పోస్టర్ లో మనకు కనిపిస్తున్నాయి. చూస్తుంటే ఈ సినిమాలో కార్తీ మరొక "ఢిల్లీ" పాత్రలో నటించబోతున్నాడని అనిపిస్తుంది.


ఈ ప్రాజెక్ట్ ను రాజు మురుగన్ డైరెక్ట్ చేస్తుండగా, అను ఇమ్మానుయేల్ హీరోయిన్ గా నటిస్తుంది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa