క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో యంగ్ హీరో తేజ సజ్జా నటిస్తున్న కొత్త చిత్రం "హనుమాన్". గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన జాంబిరెడ్డి సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో చాలా మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
నవంబర్ 15వ తేదీన హనుమాన్ టీజర్ విడుదల కాబోతుందని పేర్కొంటూ రీసెంట్గానే మేకర్స్ స్పెషల్ పోస్టర్ ను విడుదల చేసారు. తాజాగా టీజర్ లాంచ్ ఈవెంట్ డీటెయిల్స్ ను ప్రకటించారు. ఈ మేరకు నవంబర్ 15న హైదరాబాద్లోని AMB సినిమాస్ స్క్రీన్ 1 లో హనుమాన్ టీజర్ లాంచ్ ఈవెంట్ జరగనుంది. మరి, ఈ ఈవెంట్ కు రాబోయే చీఫ్ గెస్ట్ ఎవరో తెలియాల్సి ఉంది.
వాన ఫేమ్ వినయ్ రాయ్ విలన్గా నటిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ కీలకపాత్రలో నటిస్తున్నారు. అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa