బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతెలా మెగాస్టార్ చిరంజీవి 154వ సినిమా "వాల్తేరు వీరయ్య" లో ఒక స్పెషల్ సాంగ్ చెయ్యబోతుందన్న విషయం తెలిసిందే కదా. లేటెస్ట్ గా ఈ సాంగ్ షూటింగ్ స్టార్ట్ అయినట్టు తెలుస్తుంది. ఈమేరకు ఊర్వశి వాల్తేరు వీరయ్యతో అదేనండి మెగాస్టార్ తో కలిసి సెట్స్ లో దిగిన ఫోటోను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కొల్లి బాబీ డైరెక్షన్లో ఔటండౌట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో మాస్ రాజా రవితేజ కీలకపాత్రలో నటిస్తున్నారు. శ్రుతిహాసన్, క్యాథెరిన్ ట్రెసా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరిలో విడుదల కావడానికి రెడీ అవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa