బెల్లంకొండ గణేష్ హీరోగా నటిస్తున్న రెండవ చిత్రం "నేను స్టూడెంట్ సర్". అవంతికా దస్సాని హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను రాఖీ ఉప్పలపాటి డైరెక్ట్ చేసారు.
తాజాగా ఈ సినిమా నుండి టీజర్ రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధం అయ్యింది. ఈ మేరకు హైదరాబాద్ లోని ప్రసాద్ లాబ్స్ లో రేపు మధ్యాహ్నం ఒంటిగంట నుండి నేను స్టూడెంట్ సర్ టీజర్ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ ఈవెంట్ కు ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు వీవీ వినాయక్ గారు చీఫ్ గెస్ట్ గా హాజరుకాబోతున్నారు. రేపు మధ్యాహ్నం 03:06 నిమిషాలకు టీజర్ లాంచ్ కాబోతుంది.
నాంది సతీష్ వర్మ నిర్మిస్తున్న ఈ సినిమాకు మహతీ స్వరసాగర్ సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa