లింగుస్వామి దర్శకత్వంలో యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటించిన "ది వారియర్" సినిమా జులై 14, 2022న థియేటర్లలో విడుదల అయ్యింది. ఈ సినిమాలో రామ్ సరసన కృతి శెట్టి నటిస్తుంది. 3 నెలల క్రితం విడుదలైన ఈ యాక్షన్ డ్రామా ఎట్టకేలకు ప్రముఖ టీవీ ఛానెల్ స్టార్ మా అక్టోబర్ 30, 2022న సాయంత్రం 6 గంటలకు ప్రీమియర్‌గా ప్రదర్శించింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా మొదటి టెలికాస్ట్‌లోనే 9.85 టీఆర్‌పీని రాబట్టిందని సమాచారం.
ఆది పినిశెట్టి విలన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో అక్షర గౌడ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ ట్రాక్ లో వచ్చిన ఈ సినిమాకి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ ఈ సినిమాని నిర్మించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa