దీపావళి కానుకగా విడుదలైన సినిమాలలో బాక్సాఫీస్ వద్ద బాగా సౌండ్ చేసిన పటాకా "సర్దార్". కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేసి, తెలుగు, తమిళ ప్రేక్షకులను విశేషంగా మెప్పించారు. రీసెంట్గా సర్దార్ వంద కోట్ల మార్క్ ను క్రాస్ చేసి ఇంకా పరుగులు తీస్తున్నాడు.
PS మిత్రన్ డైరెక్షన్లో ఔటండౌట్ మాస్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా లేటెస్ట్ గా డిజిటల్ ఎంట్రీ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. నవంబర్ 18 నుండి సర్దార్ మూవీ తెలుగు, తమిళ భాషలలో ఆహా ఓటిటి లో స్ట్రీమింగ్ కు రాబోతుందని కొంచెంసేపటి క్రితమే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ జరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa