టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అక్కినేని నాగచైతన్య తన తదుపరి సినిమాని తమిళ దర్శకుడు వెంకట్ ప్రభుతో ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. కమర్షియల్ ఎంటర్‌టైనర్ ట్రాక్ లో రానున్న ఈ సినిమాకి టెంపరరీగా 'NC 22' అనే టైటిల్ ని పెట్టారు. ఈ చిత్రంలో నాగ చైతన్య ఒక నేరస్థుడిని పట్టుకునే మిషన్‌తో బయలుదేరిన పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో నటిస్తున్నట్లు లేటెస్ట్ టాక్. ఈ చిత్రంలో నాగచైతన్య సరసన బబ్లీ బ్యూటీ కృతి శెట్టి జోడిగా కనిపించనుంది.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా కోసం యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించేందుకు హైదరాబాద్‌లో భారీ సెట్ వేసినట్లు సమాచారం. ఈ ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్‌ని మహేష్ మాథ్యూ మాస్టర్ లీడ్ చేస్తుండగా, ఈ షెడ్యూల్ లో అరవింద్ స్వామి జాయిన్ అయ్యారు. కృతి శెట్టి, శరత్‌కుమార్, సంపత్ రాజ్ కూడా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. రెండు భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
ఈ సినిమాలో జాతీయ అవార్డు గ్రహీత ప్రియమణి, అరవింద్ స్వామి, నరేష్, సంపత్ రాజ్, వెన్నెల కిషోర్, శరత్ కుమార్, ప్రేమి విశ్వనాధ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ తెలుగు-తమిళ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ మాస్ట్రో ఇళయరాజా, ఆయన తనయుడు, మ్యూజిక్ కంపోజర్ యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని టాలీవుడ్ నిర్మాణ సంస్థ శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ నిర్మిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa