ట్రెండింగ్
Epaper    English    தமிழ்

OTTలో ఉచితంగా 'కార్తికేయ 2' మొదటి 15 నిమిషాలు

cinema |  Suryaa Desk  | Published : Thu, Nov 10, 2022, 05:23 PM

చందూ మొండేటి దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ నటించిన 'కార్తికేయ 2' సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ చిత్రంలో నిఖిల్ కి లేడీ లవ్‌గా గ్లామర్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ నటించింది. ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ డ్రామాలో సంతనుగా ఆదిత్య మీనన్, సులేమాన్‌గా హర్ష చెముడు, సదానందగా శ్రీనివాస రెడ్డి, ప్రవీణ్, సత్య మరియు తులసి ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో ధన్వంతి పాత్రలో అనుపమ్ ఖేర్ నటిస్తున్నారు.

కార్తికేయ2 సినిమా పోస్ట్ థియేట్రికల్ OTT స్ట్రీమింగ్ రైట్స్ ని ZEE5 భారీ మొత్తానికి సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది. తాజాగా ఇప్పుడు OTT ప్లాట్‌ఫారమ్ ZEE5లో ట్రెండింగ్‌లో ఉన్న ఈ  బ్లాక్‌బస్టర్ మూవీ మొదటి 15 నిమిషాల ఉచితంగా చూడటానికి అందుబాటులో ఉందని వెల్లడించారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ సినిమాకి కాల భైరవ సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa