టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో నాగశౌర్య పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. బయట నిర్మాణ సంస్థలతో పాటు, తమ సొంత బ్యానర్ లోనూ సినిమాలు చేస్తున్నారు. అయితే, నాగశౌర్యకు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం వైరల్ గా మారింది. నాగశౌర్య త్వరలోనే పెళ్లికొడుకు కాబోతున్నాడు. అనుష అనే యువతితో ఈయన వివాహం నిశ్చయమైందని, ఈ నెల 19, 20వ తేదీలలో బెంగుళూరులో వివాహం జరుగనున్నట్లు సమాచారం.కాగా, అనూష నేపథ్యం తెలియాల్సి ఉంది.