టాలీవుడ్ లో నడుస్తున్న రీ రిలీజ్ ట్రెండ్ గురించి అందరికి తెలుసు. ఈ మేరకు ఇప్పటికే స్టార్ హీరోల సూపర్ హిట్ సినిమాలు మరోసారి థియేటర్లలో విడుదలై అభిమానులను ఉర్రూతలూగించాయి.
తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ ట్రెండ్ ను ఫాలో అవుతున్నట్టు తెలుస్తుంది. రీ రిలీజ్ ట్రెండ్ లో భాగంగా తారక్ - శ్రీను వైట్ల కాంబోలో వచ్చిన సూపర్ హిట్ మూవీ బాద్షా ఈ నెల 19న మరోసారి థియేటర్లకు రాబోతుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వెలువడింది.
2013లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బిగ్ కమర్షియల్ హిట్ గా నిలిచింది. తమన్ అందించిన మ్యూజిక్ ఆల్బం చార్ట్ బస్టర్ గా నిలిచింది. హీరోయిన్ రీతూవర్మ ఈ సినిమాతోనే సినీరంగ ప్రవేశం చేసింది. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో బ్రహ్మానందం, నాజర్, తనికెళ్ళ భరణి, తదితరులు కీలకపాత్రలు పోషించారు. హీరో సిద్దార్ధ్ ఈ సినిమాలో స్పెషల్ గెస్ట్ రోల్ చెయ్యడం విశేషం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa