కరోనా ఏమంటూ ఈ భూమ్మీదకు అడుగు పెట్టిందో ఎన్నో రంగాలు ఆర్ధికంగా దెబ్బ తిన్నాయి. వాటిలో సినీరంగం కూడా ఒకటి. కరోనా మహమ్మారి కారణంగా థియేటర్లకు వెళ్లి సినిమా చూసే ప్రేక్షకుల సంఖ్య ఇదివరకటితో పోల్చితే చాలా తగ్గిపోయింది. నెమ్మదిగా ఈ పరిస్థితి మారుతుందనుకోండి. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు వస్తే ఏ మహమ్మారి కూడా థియేటర్లకు రాకుండా ప్రేక్షకులను అడ్డుకోలేదని ఇటీవల విడుదలైన కొన్ని సినిమాలు చూస్తుంటే అర్ధం అవుతుంది. RRR, గంగూభాయ్ కతియావాడి, అఖండ, పుష్ప, పొన్నియిన్ సెల్వన్.. ఈ కోవలోకే వస్తాయి. మరి మిగిలిన సినిమాల విషయానికొస్తే... అవి థియేటర్లకు అలా వచ్చి ఇలా వెళ్లిపోతున్నాయి. ప్రొడ్యూసర్లేమో ఆల్రెడీ ఆ మూవీ డిజిటల్ హక్కుల ద్వారా సేఫ్ పొజిషన్లో ఉంటున్నారు. ఎటొచ్చి నష్టపోతోంది థియేటర్ యజమానులే అంటే ఎక్జిబిటర్లు. కొత్త సినిమాల ఓటిటి రిలీజ్ పై ఈమధ్యనే టాలీవుడ్ లో ఒక చక్కని పరిష్కారం కుదిరింది.
తాజాగా ఈ అంశంపై తమిళనాడులో కూడా అగ్గి రాజుకున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో తమిళ ఎక్జిబిటర్లు తమిళనాడు ప్రొడ్యూసర్ల గిల్డ్ కు లేఖ రాసారు.. సినిమాల ఓటిటి రిలీజ్ పై చర్చించుకునేందుకు ఒక సమావేశాన్ని ఏర్పాటు చెయ్యమని. మరి, ఈ మీటింగ్లో ఒక చక్కని పరిష్కారం కుదిరితే అటు ప్రొడ్యూసర్లు, ఇటు ఎక్జిబిటర్లు... ఇద్దరూ లాభపడతారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa