కమర్షియల్ మాస్ యాక్షన్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను యువ హీరో రామ్ పోతినేనితో ఒక పాన్ ఇండియా సినిమాకు కమిటైన విషయం తెలిసిందే కదా. దసరా కానుకగా అక్టోబర్ లో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళింది.
ఈ ప్రాజెక్ట్ పై లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, హైదరాబాద్ లోని రామోజీ ఫిలింసిటీలో ఈ రోజు నుండి ఈ మూవీ న్యూ షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది. డైరెక్టర్ బోయపాటి శ్రీను, యాక్షన్ కొరియోగ్రాఫర్ శివ కలిసి ఈ షెడ్యూల్ లో భయంకర పోరాట సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. బోయపాటి ... ఈ పేరే యాక్షన్ కి పెట్టింది పేరు. ఇప్పుడు బోయపాటికి యువరక్తం రామ్ ఎనర్జీ తోడైంది కాబట్టి బిగ్ స్క్రీన్ పై రిజల్ట్ ను చూసేందుకు ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతెలా ఐటెం సాంగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa