ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యంగ్ హీరో నుండి అల్లు శిరీష్ కి స్పెషల్ సర్ప్రైజ్ ..!!

cinema |  Suryaa Desk  | Published : Tue, Nov 08, 2022, 06:24 PM

అల్లు శిరీష్ నటించిన కొత్త చిత్రం "ఊర్వశివో రాక్షసివో". రాకేష్ శశి డైరెక్షన్లో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా ఇటీవలే థియేటర్లలో విడుదలై చాలామంచి రెస్పాన్స్ అందుకుంటుంది. చాన్నాళ్ల బట్టి సాలిడ్ హిట్ లేని శిరీష్ ఈ సినిమాతో గ్రాండ్ సక్సెస్ అందుకోవడంతో సెలెబ్రిటీలు, ప్రేక్షకులు ఆయనకు బెస్ట్ విషెస్ తెలియచేస్తున్నారు.


ఈ నేపథ్యంలో యంగ్ హీరో నిఖిల్ సిద్దార్ధ్ కూడా శిరీష్ కు అభినందనలు తెలుపుతూ చేసిన ట్వీట్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంది. 'కంగ్రాట్స్ సిరి బ్రో.. ఊర్వశివో రాక్షసివో సినిమా గురించి పాజిటివ్ రివ్యూలను వింటున్నాను.. త్వరలోనే సినిమాను థియేటర్లో చూస్తాను.. ' అంటూ నిఖిల్ శిరీష్ ని అభినందిస్తూ ట్వీట్ చేసారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa