'గంగోత్రి' ఫేమ్ కావ్యా కళ్యాణ్ రామ్ హీరోయిన్ గా పరిచయమవుతున్న చిత్రం "మసూద". ఈ సినిమాతో సాయి కిరణ్ అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. తిరువీర్ రెడ్డి హీరోగా నటిస్తున్నారు.
నవంబర్ 11న విడుదల కావడానికి రెడీగా ఉన్న ఈ సినిమా నుండి లేటెస్ట్ గా 'దాచి దాచి' అనే ఫీల్ గుడ్ ఎమోషనల్ సాంగ్ యొక్క గ్లిమ్స్ వీడియో విడుదలైంది. సిద్ శ్రీరామ్ గొంతులో మరింత హృద్యంగా ఉన్న ఈ పాట రేపు సాయంత్రం ఆరింటికి విడుదల కానుంది.
స్వధర్మ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో మూడవ చిత్రంగా రాబోతున్న ఈ సినిమాకు ప్రశాంత్ విహారి సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa