ధనుష్ తొలి ద్విభాషా చిత్రం "వాతి / సార్" రీసెంట్గానే ప్రమోషన్స్ ను షురూ చేసి, అందులో భాగంగా ఫస్ట్ లిరికల్ ను విడుదల చెయ్యడానికి రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు నవంబర్ 10వ తేదీన ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదల కాబోతుందన్న విషయం తెలిసిందే కదా.
లేటెస్ట్ గా ఈ పాటకు సంబంధించి ధనుష్ సర్ప్రైజింగ్ ఎనౌన్స్మెంట్ చేసారు. జీవీ ప్రకాష్ కుమార్ పియానో వాయిస్తుంటే, ఆ పక్కనే ధనుష్ నిలబడి వాతి / సార్ ఫస్ట్ లిరికల్ సాంగ్ ను ఆలపిస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసారు. ధనుష్ గొంతులో ఈ బ్యూటిఫుల్ లవ్ మెలోడీ ఎంత వినసొంపుగా ఉందో..!! తమిళంలో ఈ పాటకు ధనుషే లిరిక్స్ అందించగా, తెలుగులో రామజోగయ్య శాస్త్రి గారు రాసారు.
వెంకీ అట్లూరి డైరెక్షన్లో తెరెక్కుతున్న ఈ సినిమాలో సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా, డిసెంబర్ 2వ తేదీన తెలుగు, తమిళ భాషలలో విడుదల కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa