బాలీవుడ్ తారలు వరుణ్ ధావన్, కృతి సనన్ బైక్ పై చక్కర్లు కొట్టారు. వీరిద్దరూ కలిసి నటించిన కామెడీ హర్రర్ చిత్రం 'భేదియా' ప్రమోషన్లలో భాగంగా స్పోర్టి ఫిట్‌లను ధరించి ఫిల్మ్ సిటీ వీధుల్లో చక్కర్లుకొట్టారు. 2015లో విడుదలైన 'దిల్ వాలే' తర్వాత భేదియా సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. ఈ సినిమాకు అమర్ కౌషిక్ దర్శకత్వం వహిస్తుండగా, దినేష్ విజాన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నవంబర్ 25న విడుదల కానుంది.