కార్తికేయ 2 తో పాన్ ఇండియా హీరోగా అవతారమెత్తిన నిఖిల్ సిద్దార్ధ్ తన నెక్స్ట్ మూవీని క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మతో ఎనౌన్స్ చేసారు. గతంలో వీరిద్దరి కలయికలో స్వామి రారా, కేశవ వంటి థ్రిల్లర్ మూవీలు వచ్చాయి. ఈ రెండిట్లో స్వామి రారా సినిమా హీరోగా నిఖిల్ కు బిగ్ బ్రేక్ అందించగా, 2017లో వచ్చిన కేశవ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది.
మరి కొన్ని రోజుల్లోనే షూటింగ్ ప్రారంభమయ్యే ఈ సినిమాపై మేకర్స్ లేటెస్ట్ గా ఒక బిగ్ అప్డేట్ ఇచ్చారు. సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ కార్తీక్ తమ సినిమాకు పాటలు స్వరపరచనున్నారని పేర్కొంటూ, అధికారిక ప్రకటన విడుదల చేసారు. ఈ సందర్భంగా ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న కార్తీక్ కు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియచేసారు.
ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుంది. దివ్యాన్ష ఖాదియా, జాన్ విజయ్, హర్ష చెముడు కీ రోల్స్ లో నటిస్తున్న ఈ చిత్రాన్ని BVSN ప్రసాద్ నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa