ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అల్లు అర్జున్ "పుష్ప 2" పై లేటెస్ట్ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Sun, Nov 06, 2022, 05:34 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్పరాజ్ గా మరోసారి ప్రేక్షకులకు కనువిందు చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ మేరకు పుష్ప 2 షూటింగ్ జరిపేందుకు మేకర్స్ ప్రీ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుతున్నారు.


సుకుమార్ ముందుగా పుష్ప 2 టీజర్ ను రిలీజ్ చెయ్యాలనే ఉద్దేశంలో ఉన్నట్టు తెలుస్తుంది. అందుకే ముందుగా టీజర్ షూటింగ్ పార్ట్ ను పూర్తి చేసి ఆపై బ్యాంకాక్ వెళ్లి అక్కడ రెగ్యులర్ షూటింగ్ ను జరుపుతారట. ఐతే, పుష్ప 2 టీజర్ ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ బిగ్ ప్లాన్ ఒకటి చేస్తున్నారు. అదేంటంటే, డిసెంబర్ 16వ తేదీన అవతార్ 2 థియేటర్లలో విడుదల కాబోతుంది. అవతార్ 2 స్క్రీనింగ్ టైం లో పుష్ప 2 టీజర్ ను ప్రదర్శించేందుకు ప్లాన్ చేస్తున్నారట.


రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో డాలి ధనంజయ్, సునీల్, అనసూయ భరద్వాజ్ కీలకపాత్రలు పోషించబోతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa