మత్తు వదలరా, సేనాపతి సినిమాలతో ఆకట్టుకునే నటనను కనబరిచిన యాక్టర్ నరేష్ అగస్త్య హీరోగా నటిస్తున్న చిత్రం 'దిల్ వాలే'. "పూలరంగడు" ఫేమ్ వీరభద్రం చౌదరి ఈ సినిమాకు దర్శకుడు కాగా, జయదుర్గాదేవి మల్టీమీడియా, డెక్కన్ డ్రీం వర్క్ బ్యానర్ పై నబీ షేక్ , తూము నరసింహ పటేల్ నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో శ్వేతా అవస్థి హీరోయిన్ గా నటిస్తుంది. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
ఇటీవలే పూజాకార్యక్రమాలలో ఈ మూవీ లాంఛనంగా ప్రారంభమైంది. క్రైం కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రోగ్రెస్ లో ఉందని తెలుపుతూ మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa