జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా ఆయన నెక్స్ట్ మూవీ ఎన్టీఆర్ 30 అధికారిక ప్రకటన జరిగిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ 30 సినిమాను కొరటాల శివ డైరెక్ట్ చెయ్యనున్నారు. ఐతే, ఇప్పటివరకు ఈ సినిమాపై ఎలాంటి అఫీషియల్ అప్డేట్ లేకపోవడంతో, చాలామంది ఈ సినిమా ఇక ఉండదని అనుకున్నారు.
తాజాగా మేకర్స్ ప్రీ ప్రొడక్షన్స్ కి సంబంధించిన కొన్ని పిక్స్ ను షేర్ చేసి ఈ సినిమా అటకెక్కలేదు అని చెప్పకనే చెప్పారు. డైరెక్టర్ కొరటాల శివ, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ముగ్గురూ కలిసి ఎన్టీఆర్ 30 సినిమా గురించిన డిస్కషన్స్ లో పాల్గొన్నట్టు తెలుస్తుంది. ఈ ఫొటోస్ ప్రస్తుతం మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa