ప్రముఖ కోలీవుడ్ నిర్మాణ సంస్థతో సూపర్ స్టార్ రజినీకాంత్ బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాల ఒప్పందం చేసుకున్నారని, ఈ రెండు సినిమాలు నవంబర్ 5వ తేదీన పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం అవుతాయని ఈ మధ్య మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది.
తాజాగా లైకా సంస్థ నుండి ఈ విషయంపై అధికారిక క్లారిటీ వచ్చినట్టు తెలుస్తుంది. రజినీకాంత్ సినిమా గురించని చెప్పలేదు కానీ, రేపు పదిన్నరకు ఒక సర్ప్రైజింగ్ ఎనౌన్స్మెంట్ రాబోతుందని లైకా ప్రొడక్షన్స్ సంస్థ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలలో తెలిపింది. సో, ఈ ఎనౌన్స్మెంట్ రజినీకాంత్ సినిమా గురించేనని అందరు అనుకుంటున్నారు. మరొక ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే, ఈ సినిమాకు రజిని పెద్ద కూతురు ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వం వహించబోతున్నారట. మరి, రేపు అధికారిక ప్రకటన వస్తే కానీ, ఈ విషయాలు నిజమని క్లారిటీ రాదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa