పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ, తొలి పీరియాడికల్ యాక్షన్ డ్రామా 'హరిహర వీరమల్లు'. క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం, పవన్ రాజకీయ పరిస్థితుల కారణంగా వాయిదాల పద్ధతిలో షూటింగ్ ను జరుపుకుంటుంది.
ఇటీవలే న్యూ షెడ్యూల్ స్టార్ట్ చేసి, పవన్ పై భీకర యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరించారు దర్శకుడు క్రిష్. తాజా సమాచారం ప్రకారం, పవన్ ఈ షెడ్యూల్ ను పూర్తి చేసినట్టు తెలుస్తుంది. షూటింగ్ స్పాట్ నుండే విజయవాడలోని ఇప్పటం గ్రామానికి బయలుదేరారు. రేపు ఇప్పటం గ్రామాన్ని సందర్శించి, అక్కడి ప్రజలతో మాట్లాడతారు.
నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మెగాసూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ సినిమాను AM రత్నం సమర్పిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa