కింగ్ నాగార్జున నుండి వచ్చిన సరికొత్త చిత్రం "ది ఘోస్ట్". దసరా కానుకగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది, కానీ ఓటిటీని మాత్రం షేక్ చేస్తుంది.
నవంబర్ 2 నుండి నెట్ ఫ్లిక్స్ ఓటిటిలోకి స్ట్రీమింగ్ కొచ్చిన ది ఘోస్ట్ మూవీ నెట్ ఫ్లిక్స్ ఇండియా టాప్ ట్రెండింగ్ #1 పొజిషన్లో దూసుకుపోతుంది. గరుడవేగ ఫేమ్ ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ మూవీలోని స్టైలిష్ యాక్షన్ సీక్వెన్సెస్ కు ప్రేక్షకుల నుండి మంచి అప్లాజ్ వచ్చింది.
సోనాల్ చౌహన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa