యంగ్ హీరో నాగశౌర్య కొత్త సినిమా ప్రకటన నిన్న జరిగిన విషయం తెలిసిందే కదా. లేటెస్ట్ గా ఈ సినిమాకు కోలీవుడ్ కంపోజర్ హ్యారిస్ జయరాజ్ గారు సంగీత దర్శకత్వం వహించబోతున్నట్టు మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు. తెలుగులో చివరిసారిగా మహేష్ బాబు 'స్పైడర్' సినిమాకు హ్యారిస్ జయరాజ్ సంగీతం అందించారు.
అరుణాచలం SS అనే కొత్త డైరెక్టర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నాగశౌర్య పక్కా యాక్షన్ అవతార్ లో కనిపించనున్నారు. వైష్ణవి ఫిలిమ్స్ బ్యానర్ లో ఫస్ట్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని Ch. శ్రీనివాసరావు, Ch. విజయ్ కుమార్, Dr. Ch. అశోక్ కుమార్ నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa