"అహ నా పెళ్ళంట" వెబ్ సిరీస్ తో ఓటిటిలోకి డిబట్ ఎంట్రీ ఇస్తున్నారు టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్. శివాని రాజశేఖర్ ఈ సిరీస్ లో హీరోయిన్ గా నటిస్తుంది. సంజీవి రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సిరీస్ ను జీ 5 మరియు తమడా మీడియా సంయుక్తంగా నిర్మించాయి. ఆమని, పోసాని కృష్ణమురళి, హర్షవర్ధన్ కీలకపాత్రలు పోషించారు.
లేటెస్ట్ గా ఈ వెబ్ సిరీస్ నుండి టైటిల్ లిరికల్ సాంగ్ విడుదలైంది. జుడా శాండీ స్వరపరిచిన ఈ పాటను కృష్ణ తేజస్వి పాడారు. RR ధృవన్ లిరిక్స్ అందించారు. హీరోహీరోయిన్ల వివాహ నేపథ్యంలో వచ్చే అందమైన ఈ పెళ్లి పాట హృదయాలను హత్తుకునేలా ఉంది.
నవంబర్ 17 నుండి జీ 5 ఓటిటిలో ఈ వెబ్ సిరీస్ తెలుగు, తమిళ భాషలలో స్ట్రీమింగ్ కావడానికి రెడీ అయ్యింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa