"యశోద" పాన్ ఇండియా సినిమాతో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ సమంత నవంబర్ 11వ తేదీన ప్రేక్షకాభిమానులను థియేటర్లలో పలకరించబోతున్న విషయం తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బృందం ఈ సినిమాకు యూ/ఏ సెర్టిఫికెట్ ఇచ్చింది.
హరి శంకర్, హరీష్ నారాయణ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్, మురళీశర్మ, సంపత్ రాజ్, ఉన్ని ముకుందన్ కీలకపాత్రల్లో నటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa