ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అడివిశేష్ హిట్ 2 టీజర్ చూసిన హీరో కార్తీ ...ఏమన్నాడంటే ..??

cinema |  Suryaa Desk  | Published : Thu, Nov 03, 2022, 05:18 PM

ఈ రోజు ఉదయమే అడివిశేష్ హీరోగా నటించిన హిట్ 2 టీజర్ విడుదలైంది. క్రైం మిస్టరీ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ టీజర్ ఒక్కసారిగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. టీజర్ కట్ చేసిన విధానము, కంటెంట్ బాగుండడంతో సెలెబ్రిటీల నుండి కూడా చాలామంచి స్పందన వస్తుంది.


ఈ మేరకు కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ , హిట్ 2 టీజర్ ను చూసి ఇంటెన్స్ అండ్ వెరీ ఎంగేజింగ్ గా ఉందని తెలుపుతూ అడివిశేష్ కు బెస్ట్ విషెస్ ను తెలియచేసారు. అలానే హీరో సుమంత్ కూడా హిట్ 2 టీజర్ ను చూసిన తరవాత సినిమా కోసం ఎదురుచూస్తున్నట్టు తెలిపారు.


శైలేష్ కొలను ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరించగా, మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది. డిసెంబర్ 2వ తేదీన హిట్ 2 థియేటర్లకు రాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa