కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్, మారియా ర్యాబోషప్క జంటగా, తెలుగు డైరెక్టర్ అనుదీప్ కేవీ తెరకెక్కించిన చిత్రం "ప్రిన్స్". తెలుగు, తమిళ భాషలలో అక్టోబర్ 21వ తేదీన గ్రాండ్ గా విడుదలై, మిక్స్డ్ టాక్ అందుకుంది.
లేటెస్ట్ గా ఈ సినిమా ప్రముఖ ఓటిటి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ నెల 24 నుండి స్ట్రీమింగ్ కి రాబోతుందని ప్రచారం జరుగుతుంది. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన రాబోతుందంట.
ఈ సినిమాను సునీల్ నారంగ్, సురేష్ బాబు, పుస్కూర్ రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మించారు. తమన్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa