ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కిరణ్ అబ్బవరం "VBVK" నుండి స్పెషల్ సర్ప్రైజ్..!!

cinema |  Suryaa Desk  | Published : Thu, Nov 03, 2022, 02:57 PM

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నుండి రాబోతున్న సరికొత్త చిత్రం "వినరో భాగ్యము విష్ణుకథ". మురళీ కిషోర్ అబ్బూరు డైరెక్షన్లో ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో కాశ్మీర పరదేశీ హీరోయిన్ గా నటిస్తుంది.


ఈ రోజు కాశ్మీర పుట్టినరోజు కావడంతో VBVK మేకర్స్ ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియచేస్తూ సినిమా నుండి ఆమె ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు. సినిమాలో కాశ్మీర దర్శన అనే పాత్రలో నటిస్తుంది.


చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని  గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లో బన్నీ వాసు నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్ గారు సమర్పిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa