ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు ఎంతో కుతూహలంగా, ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఎదురు చూసిన అవతార్ 2 ట్రైలర్ కొంచెంసేపటి క్రితమే విడుదలైంది.
జేమ్స్ కెమరూన్ డైరెక్షన్లో సైంటిఫిక్ ఫిక్షన్ విజువల్ వండర్ గా తెరెక్కిన ఈ చిత్రం 2009లో విడుదలైన అవతార్ కి ఎక్స్టెండెడ్ వెర్షన్ గా రాబోతుంది. దాదాపు పదమూడేళ్ల కాలానికి సీక్వెల్ రాబోతుందన్నా ప్రేక్షకుల నుండి వస్తున్న రెస్పాన్స్ మాములుగా లేదు. హై టెక్నికల్ వాల్యూస్ తో తెరకెక్కిన ఈ మూవీ బెటర్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ కోసం IMAX థియేటర్లను ఇంప్రొవైజ్ చేస్తున్నారట. దాదాపు 160 భాషల్లో డిసెంబర్ 16వ తేదీన అవతార్ : ది వే ఆఫ్ వాటర్ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa