ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"తగ్గేదేలే" నుండి సూథింగ్ రొమాంటిక్ లిరికల్ సాంగ్ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Wed, Nov 02, 2022, 05:55 PM

నవీన్ చంద్ర హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం "తగ్గేదేలే" నుండి కొంచెంసేపటి క్రితమే ఇదే ఇదే అనే బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్ విడుదలైనది. నవీన్ చంద్ర, అనన్యా రాజ్ లపై రొమాంటికల్ సాంగ్ గా చిత్రీకరించిన ఈ పాట సూథింగ్ మ్యూజిక్ తో ఆకట్టుకుంటుంది. చరణ్ అర్జున్ స్వరపరచి, లిరిక్స్ అందించిన ఈ సాంగ్ ను హరిచరణ్, మనీషా పాడారు.


దండుపాళ్యం ఫేమ్ శ్రీనివాసరాజు ఈ సినిమాకు దర్శకుడు కాగా, నవీన్ చంద్ర, దివ్యా పిళ్ళై హీరోహీరోయిన్లుగా నటించారు. నవంబర్ 4వ తేదీన ఈ మూవీ ధియేటర్లలో విడుదల కావడానికి రెడీ గా ఉంది.   






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa