కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ నటించిన కొత్త చిత్రం "సర్దార్". PS మిత్రన్ డైరెక్షన్లో స్పై యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 21వ తేదీన తెలుగు, తమిళ భాషల్లో విడుదలై, సూపర్ హిట్ టాక్ తో రన్ అవుతుంది. రాశిఖన్నా, రజీషా విజయన్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ లైలా కీలకపాత్రలో నటించింది. ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై లక్ష్మణ్ కుమార్ ఈ సినిమాను నిర్మించారు.
ప్రపంచవ్యాప్తంగా సర్దార్ కొస్తున్న విశేష స్పందన కారణంగా ప్రొడ్యూసర్ లక్ష్మణ్ కుమార్ డైరెక్టర్ మిత్రన్ కు ఖరీదైన టొయోటా ఫార్చ్యూనర్ SUV కారును బహుమతిగా ఇచ్చారు. ఈ మేరకు ఒక ఫోటో మీడియాలో హల్చల్ చేస్తుంది. కార్ కీస్ ను కార్తీ డైరెక్టర్ కి అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa