హీరో, సపోర్టింగ్ ఆర్టిస్ట్ నందు, ప్రముఖ బుల్లితెర యాంకర్ రష్మీ గౌతమ్ జంటగా నటించిన "బొమ్మ బ్లాక్బస్టర్" రేపు కాకుండా ఎల్లుండే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముహూర్తం ఖరారు చేసారు. ఈ మేరకు ఈ రోజు సాయంత్రం ఆరున్నర నుండి మాదాపూర్ లోని V కన్వెన్షన్ లో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. విశేషమేంటంటే, ఈ ఈవెంట్ కు 'కృష్ణ వ్రింద విహారి' అదేనండి యంగ్ హీరో నాగశౌర్య చీఫ్ గెస్ట్ గా రాబోతున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదలైంది.
రాజ్ విరాట్ డైరెక్షన్లో ఔటండౌట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని విజయీభవ ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa