మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పదహారవ సినిమాకు సంబంధించిన వార్తలు ఈ మధ్య మీడియాలో బాగా వినిపిస్తున్నాయి. ముందుగా జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో RC 16 సినిమా ఉంటుందని ప్రకటింపబడినా, లేటెస్ట్ గా ఈ కాంబో అటకెక్కినట్టు క్లారిటీ వచ్చేసింది. దీంతో RC 16 డైరెక్టర్ పై అంతటా ఆసక్తి నెలకొంది.
ఈ నేపథ్యంలో RC 16 పై ఇంట్రెస్టింగ్ విషయమొకటి మీడియాలో హల్చల్ చేస్తుంది. అదేంటంటే, ఒక టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ఈ మధ్యనే చెర్రీని కలిసి ఒక స్టోరీని నెరేట్ చేసారంట. ఈ స్టోరీ లైన్ చెర్రీకి నచ్చడంతో ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్క్రిప్ట్ తో రమ్మని చెప్పారంట. ఈ విషయం పక్కన పెడితే, కన్నడ డైరెక్టర్ నార్తన్ కూడా చెర్రీకి ఒక స్టోరీని వినిపించారని, ఇది నచ్చిన చెర్రీ నార్తన్ ను కూడా ఫుల్ స్టోరీతో రమ్మని చెప్పారని తెలుస్తుంది. ఈ ఇద్దరు డైరెక్టర్ల కధలకు చెర్రీ ఇంట్రెస్ట్ ఐతే చూపించారు కానీ, ఏది ఇప్పటివరకు ఫైనలైజ్ అవ్వలేదట. ఈ ఇద్దరిలో ఏ డైరెక్టర్ చెర్రీని మెప్పిస్తారో...? ఎవరితో RC 16 సినిమా ఉంటుందో మరి..!! చూడాలి...
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa