విలేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ "కాంతార" సినిమాకి రిషబ్ శెట్టి హీరోగా నటించడం మాత్రమే కాకుండా రచించి, దర్శకత్వం వహించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో మంచి మౌత్ టాక్ తో మొదలైన ఈ సినిమా 16వ రోజు కూడా షాకింగ్ కలెక్షన్స్ రాబడుతోంది. ఈ సినిమా నిన్న తెలుగు రాష్ట్రాల్లో మరో కోటి షేర్ రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఇప్పటి వరకు 20 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా లాంగ్ రన్‌లో మరిన్ని కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa