ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"రంగమార్తాండ"లో ఆ పది నిమిషాల సీన్ గురించి మీకు తెలుసా..??

cinema |  Suryaa Desk  | Published : Mon, Oct 31, 2022, 08:26 PM

టాలీవుడ్ క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ చేస్తున్న 21 వ సినిమా "రంగ మార్తాండ". విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ, హాస్యబ్రహ్మ బ్రహ్మానందం ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి గారు వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారు.


ప్రస్తుతం ఈ మూవీ డబ్బింగ్ కార్యక్రమాలను జరుపుకుంటుంది.  ఈ నేపథ్యంలో రంగమార్తాండలో పది నిమిషాలపాటు సాగే క్లిష్టతరమైన సీన్ కు బ్రహ్మానందం డబ్బింగ్ చెప్తున్న ఫొటోస్ ను కృష్ణవంశీ షేర్ చేసుకున్నారు. సినిమాలో ఈ సీన్ మెయిన్ హై లైట్ గా నిలుస్తుందట.


హౌస్ ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa