సత్యదేవ్ నటిస్తున్న కొత్త సినిమా "ఫుల్ బాటిల్". సత్యదేవ్ సొంత నిర్మాణ సంస్థ 'SD కంపెనీ' లో ప్రొడక్షన్ నెం. 1 గా ఈ చిత్రం రూపొందుతుంది. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సంజనా ఆనంద్ హీరోయిన్ గా నటిస్తుంది.
కొన్నాళ్లుగా సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుండి తాజాగా బిగ్ అప్డేట్ వచ్చింది. నవంబర్ 2వ తేదీన ఫుల్ బాటిల్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చెయ్యబోతున్నట్టు తెలుపుతూ ప్రీ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు.
ఈ చిత్ర దర్శకుడు ఇంతకుముందు సత్యదేవ్ తో తిమ్మరుసు అనే సినిమాని చేయగా అది సూపర్ హిట్ గా నిలిచింది. ఈ కాంబోలో రానున్న రెండో సినిమా కావటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa