బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. మూడేళ్ల తర్వాత తాను ఇండియాకు తిరిగి వస్తున్నట్లు చెబుతూ సంతోషం వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని ఇన్‌స్టా వేదికగా పంచుకుంది. తన బోర్డింగ్ పాస్ ఫొటోను షేర్ చేస్తూ 'ఫైనల్లీ.. గోయింగ్ టూ హోం. ఆప్టర్ 3 ఇయర్స్.' అని పోస్టు చేసింది. పెళ్లి తర్వాత హాలీవుడ్ సినిమాలతో బిజీగా మారిన ప్రియాంక.. కొంతకాలంగా అమెరికాలోనే నివాసం ఉంటోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa