ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అల్లు అర్జున్ "పుష్ప 2" లో కీలకంగా మారనున్న ఆ ఎపిసోడ్ ..??

cinema |  Suryaa Desk  | Published : Sat, Oct 29, 2022, 07:52 PM

టాలీవుడ్ ప్రేక్షకులే కాక, ఉత్తరాది ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం "పుష్ప 2". సుకుమార్ డైరెక్షన్లో ఔటండౌట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన పుష్ప కు సీక్వెల్ గా పుష్ప 2 రాబోతుంది. ఇందులో అల్లు అర్జున్, రష్మిక మండన్నా జంటగా నటించనున్నారు.


తాజాగా ఈ సినిమాపై ఒక ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. అదేంటంటే, పుష్ప లో రీజినల్ స్మగ్లింగ్ లీడర్ గా ఎదిగిన పుష్పరాజ్ సీక్వెల్ లో తన బిజినెస్ ను ఇంటర్నేషనల్ లెవెల్ కి తీసుకెళ్తారంట. ఈ నేపథ్యంలో థాయిలాండ్ లో ఒక షెడ్యూల్ ను మేకర్స్ ప్లాన్ చెయ్యబోతున్నారట. సినిమాలో ఈ పార్ట్ చాలా ఇంటరెస్టింగ్ గా, హై లైట్ గా నిలవనుందంట.


మరికొన్ని రోజుల్లోనే పుష్ప సీక్వెల్ పట్టాలెక్కబోతున్నట్టు తెలుస్తుంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa