ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యూట్యూబ్ #1... సమంత "యశోద" ట్రైలర్ కు థంపింగ్ రెస్పాన్స్ ..!!

cinema |  Suryaa Desk  | Published : Fri, Oct 28, 2022, 01:18 PM

సమంత నటించిన తొలి పాన్ ఇండియా ప్రాజెక్ట్ "యశోద" మూవీ ట్రైలర్ నిన్న సాయంత్రం పాన్ ఇండియా భాషల్లో విడుదలైంది. ఒక్కో భాషలో ఒక్కో స్టార్ హీరో ఈ ట్రైలర్ ను విడుదల చెయ్యడం జరిగింది. ఇంకా 24 గంటలు కూడా గడవకముందే ఈ ట్రైలర్ యూట్యూబ్ #1 ట్రెండింగ్ పొజిషన్లో దూసుకుపోతుంది. తెలుగులో 2M +వ్యూస్, హిందీలో 2M + వ్యూస్, మొత్తంగా అన్ని భాషల్లో కలిపి యశోద ట్రైలర్ కు ఇప్పటివరకు 6 మిలియన్ కు పైగా వ్యూస్ వచ్చాయి. దీంతో ప్రేక్షకులు ఈ సినిమాపై ఎంతటి క్యూరియాసిటీని చూపిస్తున్నారో అర్ధమవుతుంది. 


హరి శంకర్, హరీష్ నారాయణ్ ల ద్వయం డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. పోతే, వచ్చే నెల 11న ఈ సినిమా పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతుంది. 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa