బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, క్రేజీ హీరోయిన్ దీపికా పదుకొణె తొలిసారి కలిసి నటిస్తున్న చిత్రం "ఫైటర్". సిద్దార్థ్ ఆనంద్ ఈ సినిమాకు దర్శకుడు.
లేటెస్ట్ గా మేకర్స్ ఈ మూవీ రిలీజ్ డేట్ ను ఎనౌన్స్ చేసారు. 75వ గణతంత్య్ర దినోత్సవ సందర్భంగా జనవరి 25, 2024లో ఈ సినిమా విడుదల కాబోతుందని అధికారికంగా తెలుస్తుంది. ముందుగా ఈ సినిమాను జనవరి 26, 2023న విడుదల చెయ్యబోతున్నట్టు ప్రకటించిన మేకర్స్ తదుపరి సెప్టెంబర్ 28, 2023న విడుదల చేస్తామని ప్రకటించారు. లేటెస్ట్ గా మూడోసారి కూడా ఈ సినిమా పోస్ట్ పోన్ అయినట్టు తెలిపారు.
ఇండియన్ సినిమాలో తొలిసారిగా తెరకెక్కుతున్న ఏరియల్ యాక్షన్ ఫిలిం ఇది. వయోకామ్ 18 స్టూడియోస్, మార్ ఫ్లెక్స్ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. విశాల్ శేఖర్ సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa