క్రేజీ హీరోయిన్ హెబ్బా పటేల్ లీడ్ రోల్ లో నటిస్తున్న చిత్రం "బ్లాక్ అండ్ వైట్". LNV సూర్య ప్రకాష్ ఈ సినిమాకు దర్శకుడు.
ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ గారు కొంచెంసేపటి క్రితమే ఈ మూవీ టీజర్ ను విడుదల చేసారు. ఈ సినిమాలో హెబ్బా పెయింటింగ్ ఆర్టిస్ట్ లా నటిస్తున్నారు. హ్యాపీగా సాగుతున్న తన లైఫ్ లో అనుకోని డిస్టర్బన్స్ ... దానివల్ల తన ఫ్యూచర్, పెయింటింగ్ ఆశలు చెల్లాచెదురు కాకూడదనే ఉద్దేశంతో హెబ్బా చేసిన ఇంటెన్స్ ఎమోషనల్ థ్రిల్లరే ఈ సినిమా. టీజర్ ఆసక్తికరంగా ఉంది.
SR ఆర్ట్స్, U &I స్టూడియోస్ సంయుక్త బ్యానర్లపై పద్మనాభరెడ్డి, సందీప్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాను మేఘన రెడ్డి సమర్పిస్తున్నారు. అజయ్ అరసదా సంగీతం అందిస్తున్నారు. సూర్య శ్రీనివాస్, లహరి షరి, నవీన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa