కోలీవుడ్ నటుడు అశోక్ శెల్వన్ హీరోగా, రీతూవర్మ, అపర్ణా బాలమురళి, శివాత్మిక హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం "ఆకాశం". రొమాంటిక్ ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీ వచ్చే నెల 4వ తేదీన తెలుగు, తమిళ భాషల్లో విడుదల కాబోతుంది.
కార్తీక్ ఈ సినిమాకు డైరెక్టర్ కాగా, గోపిసుందర్ సంగీతం అందించారు. తాజా అప్డేట్ ప్రకారం, ఈ రోజే ఈ మూవీ ట్రైలర్ విడుదల కాబోతుంది. ట్రైలర్ రిలీజ్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
నిన్నిలా నిన్నిలా సినిమాతో తెలుగు తెరకు గతేడాదిలోనే పరిచయమయ్యారు అశోక్ శెల్వన్. ఐతే ఆ సినిమా ఓటిటిలో రిలీజ్ కావడంతో ఆకాశం మూవీనే తెలుగులో రిలీజ్ అవుతున్న అశోక్ సెల్వన్ తొలి సినిమా అయ్యింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa