హీరో రామ్ పోతినేనికి సంబంధించిన పిక్ ఒకటి సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. బాలీవుడ్ గ్లామరస్ బ్యూటీ ఊర్వశి రౌతెలాతో రామ్ దిగిన ఫోటో ఇది. దీంతో రామ్ - బోయపాటి సినిమాలో ఊర్వశికి భాగం ఉందని ప్రచారం జరుగుతుంది. ఐతే, ఆమె సెకండ్ హీరోయిన్ గా నటిస్తుందా లేక, ఐటెం సాంగ్ కోసమా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది.
ఇటీవలే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా, తమన్ సంగీతం అందిస్తున్నారు. రామ్ కెరీర్ లో 20వ సినిమాగా రూపొందుతున్న ఈ మూవీ ఆయన నటిస్తున్న తొలి పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడం విశేషం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa