ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కమల్ హాసన్ బర్త్ డే ట్రీట్ గా...  'విక్రమ్' 100డేస్ ఫంక్షన్

cinema |  Suryaa Desk  | Published : Thu, Oct 27, 2022, 07:08 PM

కొంతకాలంగా సరైన హిట్ లేని కోలీవుడ్ సీనియర్ హీరో, విశ్వనటుడు కమల్ హాసన్ కు "విక్రమ్" మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందించింది. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో ఔటండౌట్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాలో హీరో సూర్య స్పెషల్ గెస్ట్ రోల్ చేసారు. విలక్షణ నటులు విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ కీలకపాత్రలు పోషించారు.


నవంబర్ 7వ తేదీన కమల్ హాసన్ 68వ పుట్టినరోజును జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా విక్రమ్ శత జయంతి వేడుకలు గ్రాండ్ మ్యానర్ లో జరగనున్నాయి. నవంబర్ 7 సాయంత్రం ఐదింటి నుండి చెన్నైలోని కలైవనర్ అరంగం ఆడిటోరియం లో ఈ వేడుకలు జరగనున్నట్టు కొంచెంసేపటి క్రితమే అధికారిక ప్రకటన జరిగింది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa