ఈ ఏడాది విడుదలై బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ ఐన ఎఫ్ 3 చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది గ్లామరస్ బ్యూటీ మెహ్రీన్ పిర్జాడా. ఆమె హీరోయిన్ గా నటిస్తున్న కొత్త చిత్రం "స్పార్క్".
విక్రాంత్ హీరోగా పరిచయమవుతున్న ఈ సినిమాను అరవింద్ కుమార్ రవి వర్మ డైరెక్ట్ చేస్తున్నారు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా తాజాగా ఐస్ ల్యాండ్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్ లో హీరో, హీరోయిన్లపై బ్యూటిఫుల్ సాంగ్ ను చిత్రీకరించారు. వచ్చే నెల నుండి కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవ్వనుంది.
క్రేజీ మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేశం అబ్దుల్ వాహబ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa