కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ - బీస్ట్ ఫేమ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్లో "జైలర్" అనే సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఆగస్టు నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసిన ఈ మూవీ రిలీజ్ డేట్ పై తాజా సమాచారం అందుతుంది.
తమిళ సంవత్సరాది కానుకగా ఏప్రిల్ 14, 2023న ఈ సినిమాను విడుదల చెయ్యాలని మేకర్స్ భావిస్తున్నారట. ఐతే, ఈ విషయంపై ఇంకా ఎలాంటి అధికారిక అప్డేట్ లేదనుకోండి.
ఈ సినిమాలో కన్నడ పవర్స్టార్ లేట్ పునీత్ రాజ్ కుమార్ అన్నయ్య శివ రాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అనిరుద్ సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa