ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పర్ఫెక్ట్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ గా నవీన్ చంద్ర "తగ్గేదేలే" ట్రైలర్

cinema |  Suryaa Desk  | Published : Thu, Oct 27, 2022, 05:23 PM

నవీన్ చంద్ర హీరోగా నటిస్తున్న చిత్రం "తగ్గేదేలే". దివ్యా పిళ్ళై హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దండుపాళ్యం ఫేమ్ శ్రీనివాసరాజు దర్శకుడు.


నవంబర్ 4న విడుదల కాబోతున్న ఈ మూవీ ట్రైలర్ కొంచెంసేపటి క్రితమే రిలీజ్ అయ్యింది. టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్ధ్ ఈ ట్రైలర్ ను లాంచ్ చేసారు. నవీన్ చంద్ర ఈ సినిమాలో సీరియల్ కిల్లర్ గా నటిస్తున్నట్టు తెలుస్తుంది. థ్రిల్లింగ్ క్రైమ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా  విడుదలైన ఈ ట్రైలర్ ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తిస్తుంది.


నాగబాబు, రవికుమార్, రాజా రవీంద్ర, నైనా గంగూలీ, అయ్యప్ప శర్మ, మకరంద్ దేశ్ పాండే, అనన్యా సెన్ గుప్తా తదితరులు ఈ సినిమాలో కీలకపాత్రలు పోషించారు. చరణ్ అర్జున్ సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa