రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన కన్నడ యాక్షన్ డ్రామా 'కాంతారా' సినిమా పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 200 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. చాలా మంది సెలబ్రిటీలు ఈ సినిమా అద్భుతంగా ఉందని ప్రశంసించారు. తాజాగా ఇప్పుడు ఈ లిస్ట్ లోకి సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా చేరారు.
ఈ స్టార్ హీరో ట్విట్టర్ లో కాంతారా చిత్రం తనకు గూస్‌బంప్స్ ఇచ్చిందని వెల్లడించారు. కథానాయకుడిగానే కాకుండా ఈ చిత్రానికి రచయిత, దర్శకుడు అయిన రిషబ్ శెట్టిని రజనీ అభినందించారు. కాంతారా సినిమా భారతీయ సినిమాలో ఒక అద్భుత కళాఖండమని, టోటల్ మూవీ టీమ్‌కి రజనీకాంత్ తన అభినందనలు తెలియజేసాడు.
సప్తమి గౌడ కథానాయికగా నటించగా, అజనీష్ లోక్‌నాథ్ సౌండ్‌ట్రాక్స్ అందించారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా రిషబ్ శెట్టి ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించాడు. ఈ యాక్షన్-థ్రిల్లర్ సినిమాలో ప్రమోద్ శెట్టి, అచ్యుత్ కుమార్ మరియు నవీన్ డి పాడిల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa