నవంబర్ 4న ఇరు తెలుగు రాష్ట్రాలలో గ్రాండ్ రిలీజ్ కాబోతున్న చిత్రాలలో సంతోష్ శోభన్ హీరోగా నటించిన "లైక్ షేర్ సబ్స్క్రైబ్" మూవీ ఒకటి. ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకుడు.
విడుదల తేదీ దగ్గర పడిన నేపథ్యంలో చిత్రబృందం ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసారు. ఈ మేరకు ఈ రోజు విజయవాడ, గుంటూరులలో చిత్రబృందం ప్రచారం చెయ్యడానికి షెడ్యూల్ ప్లాన్ చేసింది. ఈ నేపథ్యంలో ఈ రోజు విజయవాడకు వచ్చిన సంతోష్ శోభన్, ఫరియా, సుదర్శన్, మేర్లపాక గాంధీ ముందుగా ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa